కుర్రకారు ఏకాంత వేళ...

ABN , First Publish Date - 2020-12-25T05:44:19+05:30 IST

ఓ యువతిని రక్షించడానికి నలుగురు యువకులు, ఇద్దరు యువతులు ఎలా శ్రమించారన్న ఇతివృత్తంతో రూపుదిద్దుకొన్న చిత్రం ‘ఏకాంతవేళ’ శుక్రవారం...

కుర్రకారు ఏకాంత వేళ...

ఓ యువతిని రక్షించడానికి నలుగురు యువకులు, ఇద్దరు యువతులు ఎలా శ్రమించారన్న ఇతివృత్తంతో రూపుదిద్దుకొన్న చిత్రం ‘ఏకాంతవేళ’ శుక్రవారం విడుదలవుతోంది. రామ్‌, జగదీశ్‌, సంజయ ఆచార్య, దివేశ్‌ హీరోలుగా, కిస్లే చౌదరి, రేఖా నిరోషా, మంజీర హీరోయిన్లుగా నటించారు. జయప్రకాశ్‌ కె. దర్శకత్వంలో సుజాత ఆళ్ల ఈ చిత్రం నిర్మించారు. తెలుగు రాష్ర్టాల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్న ముత్యాల రామదాసు మాట్లాడుతూ ‘‘ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కొన్ని థియేటర్లు ఓపెన్‌ కావాల్సి ఉంది. మాకు దొరికిన థియేటర్లలో శుక్రవారం ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు.

Updated Date - 2020-12-25T05:44:19+05:30 IST