ఏకాంతవేళ ఏం జరిగింది?

ABN , First Publish Date - 2020-12-08T07:04:18+05:30 IST

నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల మధ్య సాగే కథలో ఏం జరిగింది? ఆ కథలో ఉన్న మలుపులు ఏమిటి? అన్న అంశాలతో...

ఏకాంతవేళ ఏం జరిగింది?

నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల మధ్య సాగే కథలో ఏం జరిగింది? ఆ కథలో ఉన్న మలుపులు ఏమిటి? అన్న అంశాలతో రూపుదిద్దుకొన్న చిత్రం ‘ఏకాంతవేళ’. రామ్‌, జగదీష్‌, సంజయ్‌ ఆచార్య, దినేష్‌ హీరోలుగా, రేఖ, మంజీర, కిస్తే చౌదరి హీరోయిన్లుగా నటించారు. కె.జయప్రకాష్‌ దర్శకత్వంలో సుజాత ఆళ్ల నిర్మించారు. నిర్మాత, పంపిణీదారుడు ముత్యాల రామదాసు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ కార్యదర్శి కె.ఎల్‌.దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ ‘ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని చిత్రాలకూ మా సహకారం ఉంటుంది. కథను నమ్ముకొని తీసే ఏ చిత్రమైనా విజయం సాధిస్తుంది. ఈ సినిమా కూడా ఆడాలని కోరుకుంటున్నాం’ అన్నారు. ముత్యాల రామదాసు మాట్లాడుతూ ‘లాక్‌డౌన్‌కు ముందే ఈ సినిమా తయారైంది. అప్పటినుంచీ థియేటర్ల ప్రారంభం కోసం నిర్మాత ఎదురుచూస్తున్నారు. ఈ నెల 11న లేదా 18న థియేటర్లు ఎప్పుడు మొదలైతే ఆ రోజు విడుదల చేస్తాం’ అని తెలిపారు. చిత్రం ట్రైలర్‌ చూసి ముత్యాల రామదాసు కొనడానికి ముందుకు వచ్చారని దర్శకుడు కె.జయప్రకాశ్‌ చెప్పారు.


Updated Date - 2020-12-08T07:04:18+05:30 IST