కృష్ణమూర్తి ఏం చేస్తాడు?

ABN , First Publish Date - 2020-12-08T06:59:41+05:30 IST

పృధ్వీ దండమూడి, మైరా దోషి జంటగా నటించిన చిత్రం ‘ఐఐటీ కృష్ణమూర్తి’. శ్రీ వర్ధన్‌ దర్శకుడు. ప్రసాద్‌ నేకూరి నిర్మాత. ఈ నెల 10న అమెజాన్‌ ప్రైమ్...

కృష్ణమూర్తి ఏం చేస్తాడు?

పృధ్వీ దండమూడి, మైరా దోషి జంటగా నటించిన చిత్రం ‘ఐఐటీ కృష్ణమూర్తి’. శ్రీ వర్ధన్‌ దర్శకుడు. ప్రసాద్‌ నేకూరి నిర్మాత. ఈ నెల 10న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ ద్వారా విడుదల కానుంది. సోమవారం ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. కృష్ణమూర్తి ఏం చేస్తాడన్నది ఆసక్తికరం’’ అని తెలిపారు. యువత మెచ్చే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అని నిర్మాత చెప్పారు.


Updated Date - 2020-12-08T06:59:41+05:30 IST