వైజయంతీ మూవీస్ హామీ ఇస్తుంది.. ఏమనంటే..

ABN , First Publish Date - 2020-04-25T04:19:53+05:30 IST

ప్రేక్షకులుగా, మీరు మాకు చాలా ఇచ్చారు. కాబట్టి, ప్రతిగా, మీకు ఇష్టమైన సినిమాలు, నటీనటులు, పాటలు మొదలైన కొన్ని ఆసక్తికరమైన, తెలియని కథలను మీ ముందుకు

వైజయంతీ మూవీస్ హామీ ఇస్తుంది.. ఏమనంటే..

‘‘ప్రేక్షకులుగా, మీరు మాకు చాలా ఇచ్చారు. కాబట్టి, ప్రతిగా, మీకు ఇష్టమైన సినిమాలు, నటీనటులు, పాటలు మొదలైన కొన్ని ఆసక్తికరమైన, తెలియని కథలను మీ ముందుకు తీసుకువస్తాము. ఈ సమయంలో మేము చేయగలిగినది మీకు వినోదాన్ని ఇవ్వడమే. తప్పకుండా అది అందిస్తామని మేము హామీ ఇస్తున్నాము..’’ అంటూ వైజయంతీ మూవీస్ బ్యానర్ చేసిన ట్వీట్ చూస్తుంటే త్వరలో ప్రేక్షకులకు మరింత ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతుందనే విషయం అర్థం అవుతుంది.


48 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో ఎన్నో అపురూపమైన చిత్రాలు వచ్చాయి. ఎన్నో గొప్ప పాత్రలు అందరినీ అలరించాయి. ప్రతి చిత్రానికి ఒక స్టోరీ, ప్రతి స్టోరీకి ఒక చరిత్ర ఉంటుంది. అటువంటి ఎన్నో విషయాలను ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు వైజయంతీ మూవీస్ సిద్ధమవుతున్నట్లుగా వైజయంతీ నుంచి అధికారిక ప్రకటనను విడుదల చేశారు. మరి ఆ విషయాలు ఏంటి? ఎలా ఉండబోతున్నాయి తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. Updated Date - 2020-04-25T04:19:53+05:30 IST