‘ఇస్మార్ట్ శంకర్’ ఏడాది ఉత్సవం చేయట్లే: ఛార్మీ

ABN , First Publish Date - 2020-07-19T03:17:47+05:30 IST

హీరోయిన్ ఛార్మీ.. ఇప్పుడు నటిగా కాకుండా నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. డైరెక్టర్ పూరి జగన్నాధ్‌తో కలిసి, తను కూడా పెట్టుబడి పెడుతూ నిర్మాతగా మారి సినిమాలు

‘ఇస్మార్ట్ శంకర్’ ఏడాది ఉత్సవం చేయట్లే: ఛార్మీ

హీరోయిన్ ఛార్మీ.. ఇప్పుడు నటిగా కాకుండా నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. డైరెక్టర్ పూరి జగన్నాధ్‌తో కలిసి, తను కూడా పెట్టుబడి పెడుతూ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి, ఛార్మీ నిర్మాతలుగా ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చి ఉన్నాయి. అయితే ఈ జంటకు బ్లాక్‌బస్టర్ విజయాన్ని ఇచ్చింది మాత్రం రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రమే. ఈ చిత్రం జూలై 18తో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రామ్, పూరి అభిమానులు ఏడాది ఉత్సవాలు ఏమైనా ఉంటాయేమోనని ఊహించుకుంటున్న సందర్భంలో వారందరికీ చార్మీ క్లారిటీ ఇచ్చింది.


ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇస్మార్ట్ శంకర్ సెలబ్రేషన్స్ చేయట్లేదు. కారణం ఏమిటో అందరికీ తెలుసు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెలబ్రేషన్స్ సాధ్యమయ్యే పని కాదు. ప్రస్తుతం అందరం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నాం. అందుకే అభిమానులందరికీ కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఇంటి పట్టునే క్షేమంగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ గురించి చెప్పాలంటే.. ఈ విజయం మాకు ఎంతో అవసరం కూడా. ఈ సక్సెస్ కోసం చాలా కాలం వెయిట్ చేశాం. టీమ్ అంతా ఎంతో ఎనర్జీతో పనిచేసి.. ఈ విజయాన్ని అందించారు. ఈ సందర్భంగా టీమ్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..’’ అని తెలిపారు.

Updated Date - 2020-07-19T03:17:47+05:30 IST