మేం మళ్లీ వస్తున్నాం!

ABN , First Publish Date - 2020-05-13T05:39:34+05:30 IST

‘‘సోషల్‌ మీడియా పుణ్యమా అని ప్రతి సంవత్సరం ‘గబ్బర్‌ సింగ్‌’ జ్ఞాపకాలు నాతో పాటే ఉంటున్నాయి. ‘ఎనిమిదేళ్లయిందా’ అని ఆశ్యర్యపోవడంతో పాటు పవర్‌స్టార్‌తో పని చేసి అప్పుడే...

మేం మళ్లీ వస్తున్నాం!

‘‘సోషల్‌ మీడియా పుణ్యమా అని ప్రతి సంవత్సరం ‘గబ్బర్‌ సింగ్‌’ జ్ఞాపకాలు నాతో పాటే ఉంటున్నాయి. ‘ఎనిమిదేళ్లయిందా’ అని ఆశ్యర్యపోవడంతో పాటు పవర్‌స్టార్‌తో పని చేసి అప్పుడే ఎనిమిదేళ్లయిపోయిందా? అన్న ఆందోళన లేకపోలేదు’’ అని హరీశ్‌ శంకర్‌ ట్వీట్‌ చేశారు. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా ఆయన దర్శకత్వం వహించిన ‘గబ్బర్‌ సింగ్‌’ విడుదలై సోమవారానికి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృత.్ఞతలు తెలిపారు. అలాగే, ‘మేం మళ్లీ వస్తున్నాం’ అని హరీశ్‌ శంకర్‌ పేర్కొన్నారు. ‘గబ్బర్‌ సింగ్‌’ తర్వాత హీరో, దర్శకుడి కలయికలో మరో చిత్రం రానున్న సంగతి తెలిసిందే. దీనికి ‘గబ్బర్‌ సింగ్‌’కి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌ పని చేయనున్నట్టు దర్శకుడు తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

Updated Date - 2020-05-13T05:39:34+05:30 IST