అల... ‘ఎక్స్‌పైరీ డేట్‌’లో

ABN , First Publish Date - 2020-08-17T05:43:22+05:30 IST

జూనియర్‌ ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌గా పేరు పొందిన స్నేహా ఉల్లాల్‌ గుర్తున్నారా? ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘కరెంట్‌’, ‘సింహా’, ‘అలా మొదలైంది’ చిత్రాలతో సందడి చేశారు...

అల... ‘ఎక్స్‌పైరీ డేట్‌’లో

జూనియర్‌ ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌గా పేరు పొందిన స్నేహా ఉల్లాల్‌ గుర్తున్నారా? ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘కరెంట్‌’, ‘సింహా’, ‘అలా మొదలైంది’ చిత్రాలతో సందడి చేశారు. త్వరలో డిజిటల్‌ తెర వీక్షకులను ఆమె అలరించనున్నారు. ఇప్పుడు స్నేహా ఉల్లాల్‌ ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు. దాని టైటిల్‌ ‘ఎక్స్‌పైరీ డేట్‌’. జీ 5 ఓటీటీలో ప్రసారం కానుంది. ఇదొక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అని తెలిసింది. తెలుగమ్మాయి మధు శాలిని, ‘బిగ్‌ బాస్‌-3’ ఫేమ్‌ అలీ రెజా, ‘బద్లా’లో తాప్సీ ప్రియుడిగా నటించిన టోనీ లూక్‌, భరత్‌రెడ్డి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


ప్రస్తుతం ఈ సిరీస్‌ చిత్రీకరణ శరవేగంగా చేస్తున్నారు. ఎడిటర్‌ మార్తాండ్‌ కె. వెంకటేశ్‌ సోదరుడు శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త ఒకరు దీనికి సంగీత సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నారని సమాచారం. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సిరీ్‌సకి శరత్‌ మరార్‌ నిర్మాత. ఒరిజినల్‌ సిరీ్‌సలు ‘లూజర్‌’, ‘గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి’తో తెలుగు వీక్షకులను ఆకట్టుకున్న ‘జీ 5’... ప్రస్తుతం ‘ఎక్స్‌పైరీ డేట్‌’, సుస్మితా కొణిదెల నిర్మిస్తున్న సిరీస్‌ సహా మరికొన్ని ఎక్స్‌క్లూజివ్‌గా అందించనుంది.

Updated Date - 2020-08-17T05:43:22+05:30 IST