బన్నీ ట్వీట్‌పై వార్నర్ స్పందన!

ABN , First Publish Date - 2020-05-14T02:29:29+05:30 IST

ఆస్ట్రేలియా క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ జట్టు సభ్యుడు టిక్‌టాక్‌లో హల్‌చల్ చేస్తున్నాడు.

బన్నీ ట్వీట్‌పై వార్నర్ స్పందన!

ఆస్ట్రేలియా క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ జట్టు సభ్యుడు డేవిడ్ వార్నర్ టిక్‌టాక్‌లో హల్‌చల్ చేస్తున్నాడు. తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్‌లు వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల `అలవైకుంఠపురములో..` చిత్రంలోని `బుట్టబొమ్మ` సాంగ్‌కు భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన వార్నర్.. తాజాగా `రాములో.. రాముల..` పాటకు చిందులేశాడు. 


ఈ వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై స్టైలిష్ ‌స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించాడు. `మరో అతిపెద్ద సర్‌ప్రైజ్. మరోసారి ధన్యవాదాలు సర్. చించేశారు` అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు వార్నర్ స్పందిస్తూ.. `ఏదో నా వంతు ప్రయత్నం చేశాను. నాకు ఆ పాట, డ్యాన్స్ చాలా నచ్చాయ`ని రిప్లై ఇచ్చాడు. 
Updated Date - 2020-05-14T02:29:29+05:30 IST