ఈసారి `రాములో.. రాముల.. ` అంటున్న వార్నర్!

ABN , First Publish Date - 2020-05-12T21:11:54+05:30 IST

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సభ్యుడు, విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమా పాటలు, డైలాగులతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు

ఈసారి `రాములో.. రాముల.. ` అంటున్న వార్నర్!

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సభ్యుడు, విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమా పాటలు, డైలాగులతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు. ఇటీవల `అల వైకుంఠపురములో..` చిత్రంలోని `బుట్టబొమ్మ` పాటకు తన భార్యతో కలిసి వార్నర్ డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. 


దాని తర్వాత `పోకిరి` చిత్రంలోని `ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను` అనే డైలాగ్ చెప్పాడు. దానికి `పోకిరి` చిత్రం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సూపర్‌హిట్ సాంగ్‌కు వార్నర్ చిందులేశాడు. `అల వైకుంఠపురములో..` చిత్రంలోని మరో సూపర్‌హిట్ సాంగ్ `రాములో..రాముల`కు తన ఫ్యామిలీతో కలిసి వార్నర్ చిందులేశాడు. ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. 
Updated Date - 2020-05-12T21:11:54+05:30 IST