పవన్, ప్రకాష్ రాజ్‌ల మధ్య వార్ స్టార్ట్ కాబోతోంది
ABN , First Publish Date - 2020-12-01T03:38:01+05:30 IST
ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. 'ఊసరవెల్లి' అంటూ సంభోదించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు.. ప్రకాష్ రాజ్‌కు

ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. 'ఊసరవెల్లి' అంటూ సంభోదించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు.. ప్రకాష్ రాజ్‌కు స్ట్రాంగ్ రిప్లయ్ ఇస్తూ ఓ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాగబాబు లెటర్‌కు ఆ భాష నాకు రాదు అంటూ ప్రకాష్ రాజ్ కూడా స్ట్రాంగ్‌గానే కౌంటర్ వేశారు. మరి ఇలాంటి తరుణంలో పవన్, ప్రకాష్ రాజ్‌ల మధ్య వార్ అంటే.. చాలా ఆసక్తికరమైన విషయమే. అయితే ఇది రియల్‌కి సంబంధించిన వార్ కాదు.. రీల్‌కి సంబంధించిన వార్. పవన్ కల్యాణ్ తాజాగా చేస్తోన్న 'వకీల్ సాబ్' చిత్ర షూటింగ్ చివరిదశలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ లాయర్‌గా నటిస్తున్నారు.
న్యాయం వైపు నిలబడి పవన్ వాదిస్తుంటే.. అన్యాయం వైపు నిలబడి ప్రకాష్ రాజ్ వాదించేందుకు రెడీ అవుతున్నారు. డిసెంబర్‌లో వీరిద్దరూ పాల్గొనే కోర్టు సీన్లు చిత్రీకరించేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే ఇటీవల ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ దృష్ట్యా వీరిద్దరూ ఎదురెదురు పడినప్పుడు ఎటువంటి వాతావరణం నెలకొంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు.. అని ఎవరి పని వారు చేసుకుంటారో.. లేక ఇక్కడ కూడా ఏదైనా హైలెట్ అవుతుందో తెలియాలంటే.. వీరిద్దరూ ఎదురుపడే వరకు వేచి చూడక తప్పదు.
Read more