వైజయంతీ మూవీస్ తొలి చిత్రానికి 45 ఏళ్ళు
ABN, First Publish Date - 2020-12-13T03:14:27+05:30
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన తొలి చిత్రం 'ఎదురులేని మనిషి' 45 ఏళ్ళు పూర్తిచేసుకుంది. 1975, డిసెంబర్ 12న విడుదలైన ఈ సినిమాలో
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన తొలి చిత్రం 'ఎదురులేని మనిషి' 45 ఏళ్ళు పూర్తిచేసుకుంది. 1975, డిసెంబర్ 12న విడుదలైన ఈ సినిమాలో యన్టీఆర్, వాణిశ్రీ హీరోహీరోయిన్లుగా నటించగా.. జగ్గయ్య, కాంతారావు, ప్రభాకర్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కె.బాపయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటరత్న యన్టీఆర్ దుస్తులు అప్పట్లో ట్రెండీగా నిలిచాయి. కె.వి.మహదేవన్ సంగీతాన్నందించిన ఈ చిత్రంలోని పాటలు అప్పటి కుర్రకారును ఉర్రూతలూగించాయి. ఇక.. వైజయంతీ బ్యానర్ కి ఆ పేరు పెట్టింది యన్టీఆరేనని అశ్వనీదత్ చెబుతుంటారు. అలాగే, వైజయంతీ తొలి చిత్రమైన 'ఎదురులేని మనిషి'కి ఆ టైటిల్ ని కె.రాఘవేంద్రరావు సూచించారట.