చిత్ర ఆత్మహత్యకు ప్రేరేపించిన మూడో వ్యక్తి ఎవరు?

ABN , First Publish Date - 2020-12-21T17:14:32+05:30 IST

ప్రముఖ టీవీ నటి ‘ముల్లై’ చిత్ర ఆత్మహత్య వ్యవహారంలో

చిత్ర ఆత్మహత్యకు ప్రేరేపించిన మూడో వ్యక్తి ఎవరు?

చెన్నై : ప్రముఖ టీవీ నటి ‘ముల్లై’ చిత్ర ఆత్మహత్య వ్యవహారంలో ‘మరో’ వ్యక్తి వున్నాడా? అతను పట్టుబడితే అసలు వ్యవహారమేంటో తేలిపోతుందా? అవుననే అంటున్నారు హేమనాథ్‌ తండ్రి రవిచంద్రన్‌. ఆ విషయాన్ని పట్టుకొని ఆమె ఆత్మహత్యలోని లోగొట్టు తేల్చాలని ఆయన చెబుతున్నారు. ‘ముల్లై’ చిత్ర ఆత్మహత్యకు ప్రేరేపించిన మూడో వ్యక్తిని కనుగొని చట్టం ఎదుట హాజరుపరచాలని  రవిచంద్రన్‌ నగర పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. చిత్ర ‘కాల్స్‌’ అనే తమిళ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆ చిత్రం విడుదల కాకముందే ఆమె ఈనెల 9న పూందమల్లి సమీపం నజరత్‌పేట హోటల్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి ఆరురోజులపాటు హేమనాథ్‌ను విచారించిన మీదట చిత్రను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించాడనే నేరారోపణపై అతడిని పుళల్‌ జైలుకు తరలించారు. హేమనాథ్‌  అరెస్టుపై అతడి తండ్రి రవిచంద్రన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


చిత్ర తన కుమారుడిని ప్రేమించకమునునే మరో ముగ్గరిని ప్రేమించిందని వారిలో ఒకరితో నిశ్చితార్థం చేసుకోవాలని కూడా ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. ఓ టీవీ యాంకర్‌తోనూ చిత్రకు సంబంధాలున్నాయని, రాజకీయ నాయకుడొకరు చిత్రతో తరచూ సెల్‌ఫోన్‌లో మాట్లాడేవారన్నారు.. రాజకీయ నాయకుడు చిత్రకు ఫోన్‌ చేసి న్యూఇయర్‌ సందర్భంగా తనతో  గడిపేందుకు రమ్మని ఫోన్‌లో ఆహ్వానించినట్టు కూడా తెలిసిందని, అంతే కాకుండా ఓ అజ్ఞాత వ్యక్తి తరచూ చిత్రను ఫోన్‌లో బెదరించేవాడని కూడా తనకు తెలిసిందిని హేమనాథ్‌ తండ్రి ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పోలీసుల విచారణలో వాస్తవాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-12-21T17:14:32+05:30 IST