ప్రముఖ నటి ఆత్మహత్యపై తల్లి వాంగ్మూలం ఇదీ..

ABN , First Publish Date - 2020-12-15T17:11:17+05:30 IST

బుల్లితెర నటి చిత్ర ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి

ప్రముఖ నటి ఆత్మహత్యపై తల్లి వాంగ్మూలం ఇదీ..

చెన్నై : బుల్లితెర నటి చిత్ర ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ఆమె భర్త హేమనాథ్‌ వేధింపులే కారణమంటూ ఆమె తల్లి విజయ ఆర్డీవో ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. జనవరిలో చిత్ర, హేమనాథ్‌ వివాహం జరగాల్సి ఉండగా ఇరువురూ కుటుంబీకు లకు తెలియకుండా అక్టోబర్‌ 19న రిజిస్టర్‌ మ్యారేజీ చేసుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనితో చిత్ర ఆత్మహత్య సంఘటన పై ఆర్డీవో విచారణకు ఆదేశించారు. శ్రీపెరుంబుదూరు ఆర్డీవో దివ్యశ్రీ తన విచారణ ప్రారంభించారు. 


సోమవారం ఉదయం కోట్టూరుపురంలో ఉన్న చిత్ర తల్లిదండ్రుల వద్ద ఆర్డీవో విచారణ జరిపారు. సుమారు గంటకు పైగా ఈ విచారణ కొనసాగింది. విచారణ తర్వాత చిత్ర తల్లి విజయ మీడియాతో మాట్లాడారు. తన కుమార్తె చిత్ర చాలా ధైర్యవంతు రాలని, ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం లేదని చెప్పారు. తనకు కుమార్తెకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని, హేమనాథ్‌తో వివాహానికి  అంగీకారం తెలిపామని చెప్పారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు చిత్ర తనతో ఫోన్‌లో మాట్లాడిందని, ఆమె తెలిపిన వివరాలను బట్టి ఆత్మహత్యకు హేమనాథ్‌ కారణమని ఆర్డీవో ఎదుట వాంగ్మూలం ఇచ్చానని విజయ తెలిపారు.

Updated Date - 2020-12-15T17:11:17+05:30 IST

Read more