సుశాంత్‌ ఆత్మ‌హ‌త్యపై వివేక్ సంచ‌ల‌న లెట‌ర్‌

ABN , First Publish Date - 2020-06-16T15:09:01+05:30 IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన అనంత‌రం న‌టుడు వివేక్ ఓబెరాయ్ తన ట్విట్ట‌ర్‌ఖాతాలో ఒక ఓపెన్ లెట‌ర్ రాశారు.

సుశాంత్‌ ఆత్మ‌హ‌త్యపై వివేక్ సంచ‌ల‌న లెట‌ర్‌

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన అనంత‌రం న‌టుడు వివేక్ ఓబెరాయ్ తన ట్విట్ట‌ర్‌ఖాతాలో ఒక ఓపెన్ లెట‌ర్ రాశారు. ఆ లేఖ‌లో వివేక్ త‌న మ‌న‌సులో దాగున్న విష‌యాల‌ను బ‌య‌టపెట్టారు. వివేక్ చేసిన ఈ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.... ఈరోజు సుశాంత్ అంత్య‌క్రియ‌ల్లో పాల్గొనాల్సి రావ‌డం ఎంతో బాధాక‌రంగా ఉంది. అత‌ని వ్య‌క్తిగ‌త బాధ‌ల‌లో నేను పాలు పంచుకుని ఉంటే, అత‌ని బాధ‌ త‌గ్గేందుకు సాయం ల‌భించివుండేది. ఆ ప‌ని చేయ‌నందుకు ఇప్పుడు ఎంతో బాధ‌గా ఉంది. ఇది న‌న్నెంత‌గానే వేధిస్తోంది. అయితే చావు అన్నింటికీ ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య ప‌రిస్థితుల‌ను మార్చలేదు. సుశాంత్ త‌న కుటుంబ స‌భ్యులు, అభిమానుల గురించి ఒక్క‌సారి ఆలోచించినా ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాదు. అత‌ని తండ్రి  కుమారుని చితికి నిప్పు పెడుతున్న‌‌ప్పుడు అత‌నిని చూడ‌లేక‌పోయాను. సుశాంత్ సోద‌రి రోదిస్తూ త‌న సోద‌రుడిని తిరి‌గి ర‌మ్మ‌ని వేడుకుంటూ రోదించ‌డం కంట‌త‌డిపెట్టింది. ఈ బాధ‌ను మాట‌ల‌లో వ‌ర్ణించ‌లేను. మ‌న ఇండ‌స్ట్రీ అంతా ఒకే కుటుంబ‌మ‌ని చెబుతుంటారు. ఈ మాట‌ను అంద‌రూ ఒక‌సారి అవ‌లోక‌న చేసుకోవాలి. మ‌న‌లో మార్పు రావాలి. ఇత‌రులకు చెడు చేసేకంటే మంచి చేసేందుకు ప్ర‌య‌త్నించాలి. అహంకారాన్ని ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌తిభ ఉన్న‌వారిని ప్రోత్స‌హించాల్సిన‌ అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇప్పుడు జ‌రిగిన ఘ‌ట‌న మ‌నందరికీ వేక‌ప్ కాల్ లాంటిది. ఎప్పుడూ న‌వ్వుతూ తుళ్లుతూ తిరిగే సుశాంత్‌ను నేను మిస్స‌య్యాను. ఈ బాధ‌ను త‌ట్టుకునే శ‌క్తిని ఈశ్వ‌రుడు అత‌ని  కుటుంబానికి ఇవ్వాలని వేడుకుంటున్నాను... అని వివేక్ రాశారు. 

Updated Date - 2020-06-16T15:09:01+05:30 IST