మంచి కమర్షియల్‌ హిట్‌ కోసం చూస్తున్నా: విశ్వంత్‌

ABN , First Publish Date - 2020-03-04T03:21:34+05:30 IST

నేను నటుడిగా ఇంతవరకు చేసిన పాత్రలు వేరు. పిట్టకథలోని నా పాత్రలో ప‌లు వేరియేషన్స్‌ ఉన్నాయి. నటన పరంగా దాదాపు క్రిష్‌ అనే నా పాత్రకు

మంచి కమర్షియల్‌ హిట్‌ కోసం చూస్తున్నా: విశ్వంత్‌

‘నేను నటుడిగా ఇంతవరకు చేసిన పాత్రలు వేరు. పిట్టకథలోని నా పాత్రలో ప‌లు వేరియేషన్స్‌ ఉన్నాయి. నటన పరంగా దాదాపు క్రిష్‌ అనే నా పాత్రకు పూర్తి న్యాయంచేశాను’ అని క‌థానాయ‌కుడు విశ్వంత్‌  తెలియజేశారు. ‘మనమంతా’, ‘తోలుబొమ్మలాట’ తర్వాత విశ్వంత్‌ చేస్తున్న సినిమా ‘ఓ పిట్టకథ’. విశ్వంత్‌, బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావు, నిత్యా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ కీల‌కపాత్ర పోషించారు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనందప్రసాద్‌ నిర్మించారు. చెందు ముద్దు దర్శకుడు. ఈ నెల 6న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా విశ్వంత్‌  మీడియాతో ముచ్చటించారు.


ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇందులో ముగ్గురు క్యారెక్టర్లు ప్రధానం. ముగ్గురికీ ఒక్కో పిట్టకథ ఉంటుంది. అవి ఒక్కొక్కరికి రిలేటెడ్‌గా ఉంటాయి. ఏ పాత్ర ఎలా చెబుతుందనేది విజన్‌. అది ఎలా అనేది తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే. దర్శకుల‌కు సినిమా గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ఇది స్క్రీన్‌ప్లే గేమ్‌. దాని గురించి తెలిసి కొరటాల శివగారికి ఈ సినిమా బాగా నచ్చింది. మా గురువుగారు చంద్రశేఖర్‌ ఏలేటిగారికీ నచ్చింది. అలా కొరటాలగారికి ఈ స్క్రీన్‌ప్లే నచ్చి తెలుగులో ఇటువంటి స్క్రీన్‌ప్లే బేస్డ్‌ స్టోరీ చాలా కొత్తగా వుంది. పిట్టకథంటే చిన్నదికాదు పెద్ద కథ అని అన్నారు. దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటిగారు నా గురువుగారు. ఆయన సినిమా చేశాక ఆయనతోనే జర్నీ చేయాల‌ని ఎక్కువ ఆయనతో ప్రయాణం అయ్యాను. ఆ సమయంలో నాకు ఈసినిమా గురించి చెప్పారు. చెందు ముద్దు అనే వ్యక్తి మంచి కథ చెప్పారు. చాలా బాగుంది. చేస్తావా అని అడిగారు. యేలేటిగారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఆయన చెప్పారని కథ కూడా వినకుండా ఈ సినిమా చేయడానికి ఒపుకున్నా. నేను చంద్రశేఖర్‌ యేలేటిగారి ‘మనమంతా’ సినిమా చేశాను. ఆయన అంటే నాకు చాలా గౌరవం. నాకు సరైన కథ రావడంలేదు, ఒక పర్ఫెక్ట్‌ సినిమా చేయాలి. మీతో ట్రావెల్‌ అవుతానని చెప్పి ఆయనతో ట్రావెల్‌ అయ్యాను. ఇక స్క్రీన్‌‌ప్లేలో ఆయనకున్న పట్టుగురించి అందరికీ తెలిసిందే. అలాంటి ఆయనకు ఈ సినిమా స్క్రీన్‌‌ప్లే బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని పూర్తి నమ్మకం ఉంది.


ఈ సినిమా ఒక స్క్రీన్‌‌ప్లే గేమ్‌. నాకు తెలిసి తెలుగు సినిమాల్లో ఇలాంటి స్క్రీన్‌‌ప్లే రాలేదు. విలేజ్‌ నేపథ్యంలో చేశాం కాబట్టి సింపుల్‌గా అనిపిస్తోంది. టైటిల్‌ అలా పెట్టడానికి కూడా స్క్రీన్‌‌ప్లేనే కారణం. సినిమాలో చాలా యాంగిల్స్‌లో స్క్రీన్‌‌ప్లే నడుస్తోంది. కచ్చితంగా ఈ సినిమా కొత్తగా అనిపిస్తోంది. నా పాత్రలో చాలా వేరియేషన్స్‌ ఉంటాయి. నేను ఇలాంటి క్యారెక్టర్‌లో ఇంతవరకు చెయ్యలేదు. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల‌న్నీ మంచి సినిమాలే. మంచి సినిమాలు చేస్తాడు అనే మంచి పేరును నాకు తీసుకువచ్చాయి. అయితే కమర్షియల్‌గా అవి పెద్దగా వర్కౌట్‌ అవకపోయినా గుడ్‌ ఫిల్మ్స్‌ చేశాను అనే సంతృప్తి నాకు ఉంది. నా కెరీర్‌లో ‘మనమంతా’ లాంటి మంచి సినిమా ఉన్నందుకు గౌరవంగా చెప్పుకుంటా. ప్రస్తుతం నేను మంచి కమర్షియల్‌ హిట్‌ కోసం చూస్తున్నాను. రీసెంట్‌గా ‘కాదల్‌’ అని ఒక సినిమా చేశాను. అది నాకు కమర్షియల్‌ హిట్‌ ఇస్తోందని అనుకుంటున్నాను. ఆ సినిమా కాకుండా ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’ అనే మరో సినిమా కూడా ప్రస్తుతం షూట్‌లో ఉంది. ఈ సినిమా ఎమోషనల్‌గా సాగుతూనే కమర్షియల్‌ యాంగిల్‌లోనే ఉంటుంది. ఈ రెండు సినిమాలు బాగా వస్తున్నాయి. ‘ఓ పిట్టకథ’ని అందరూ థియేటర్లలో చూసి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు.

Updated Date - 2020-03-04T03:21:34+05:30 IST