ఎన్టీఆర్ పాట.. హీరో, మ్యూజిక్ డైరెక్టర్ గొడవ

ABN , First Publish Date - 2020-05-25T14:01:11+05:30 IST

ఎన్టీఆర్ పుట్టిన‌రోజున హీరో విశ్వ‌క్‌సేన్ మాస్ కా బాప్ అంటూ ఓ ట్రిబ్యూట్ సాంగ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఎన్టీఆర్ పాట.. హీరో, మ్యూజిక్ డైరెక్టర్ గొడవ

ఎన్టీఆర్ పుట్టిన‌రోజున హీరో విశ్వ‌క్‌సేన్ మాస్ కా బాప్ అంటూ ఓ ట్రిబ్యూట్ సాంగ్ చేసిన సంగ‌తి తెలిసిందే. విశ్వ‌క్ హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘ఫ‌ల‌క్‌నుమాదాస్‌’ సినిమాలోని రాప్ సాంగ్‌ను విశ్వ‌క్ ట్రిబ్యూట్ సాంగ్‌గా వాడుకున్నాడు. అయితే త‌న అనుమ‌తి లేకుండా విశ్వ‌క్ ఈ సాంగ్‌ను వాడుకున్నాడంటూ మ్యూజిక్ డైరెక్ట‌ర్ వివేక్ సాగ‌ర్ అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశాడు. స‌ద‌రు పాట‌ను తొల‌గించాల‌ని విశ్వ‌క్ కోరినా ఫ‌లితం క‌న‌ప‌డ‌లేదు. దీంతో విశ్వ‌క్‌పై వివేక్‌సాగ‌ర్ లీగ‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అనుకుంటున్నాడు.


అయితే విశ్వ‌క్‌సేన్ మాత్రం ఫ‌ల‌క్‌నుమాదాస్ చిత్రంలో తాను హీరోగానే న‌టించ‌డం కాకుండా సినిమాను డైరెక్ట్ చేసి నిర్మించాన‌ని కాబ‌ట్టి స‌ర్వ‌హ‌క్కులు త‌నవేన‌ని అంటున్నాడు. ‘పాట‌కు సంబంధించిన వివేక్‌కు క్రెడిట్ ఇచ్చాం. ఆయ‌న అనుమ‌తి లేకుండా చేయ‌డం నా త‌ప్పే. అందుకు నేను క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నా’నంటూ విశ్వక్ చెబుతున్నాడు. మరి ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి. 

Updated Date - 2020-05-25T14:01:11+05:30 IST

Read more