వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా.. దయచేసి చెప్పండి: మంచు విష్ణు

ABN , First Publish Date - 2020-05-14T15:55:33+05:30 IST

జన్మనిచ్చే తల్లి, అన్నం పెట్టే రైతన్న, ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల భద్రత కోసం పనిచేసే వీర జవానులు

వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా.. దయచేసి చెప్పండి: మంచు విష్ణు

జన్మనిచ్చే తల్లి, అన్నం పెట్టే రైతన్న, ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల భద్రత కోసం పనిచేసే వీర జవానులు.. ఈ ముగ్గురికి లభించాల్సిన గుర్తింపు దక్కడం లేదని టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆదర్శనీయమైన కన్నతల్లులను, కష్ట జీవులైన రైతులను కొంతమందిని కలిశానని, కాని వీర జవానులను కలిసే అదృష్టం మాత్రం తనకెప్పుడూ దక్కలేదని చెప్పాడు. 


భారత ఆర్మీలో తమదైన ముద్ర వేసిన తెలుగు వీర జవానుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నట్టు విష్ణు తెలిపాడు. ఎవరి దగ్గరైనా తెలుగు వీర జవానుల గురించిన కథలు, ఫొటోలు, వీడియోలు, పేర్లు ఉంటే తన ట్విటర్ ఖాతాకు పంపించాల్సిందిగా కోరాడు. ప్రపంచానికి వారి కథలను పరిచయం చేద్దామని పిలుపునిచ్చాడు. 
Updated Date - 2020-05-14T15:55:33+05:30 IST