సోనూ...నాకెంతో స్ఫూర్తినిచ్చావు: విశాల్‌

ABN , First Publish Date - 2020-11-04T01:42:49+05:30 IST

లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత పని కోల్పోయిన చాలా మందికి ఉద్యోగాలను కల్పించారు సోనూసూద్‌. ఇప్పటికీ..

సోనూ...నాకెంతో స్ఫూర్తినిచ్చావు: విశాల్‌

కరోనా వైరస్‌ ప్రభావంతో దేశంలో లాక్‌డౌన్‌ను ప్రకటించినప్పుడు పేదలు, మధ్య తరగతివారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో సినీ రంగానికి చెందిన పలువురు స్టార్స్‌ తమకు తోచిన రీతిలో ప్రజలకు సాయాన్ని చేశారు. అయితే సోనూసూద్‌ చేసిన సేవా కార్యక్రమాలు గురించి ఎంత చెప్పినా తక్కువే. పేదలకు ఆహారాన్ని అందించడంతో పాటు ఫ్రంట్‌ వారియిర్స్‌గా నిలిచిన డాక్ట్రర్స్‌, నర్సులు, ఇతర వైద్యసిబ్బందికి అండగా నిలిచి వారికి ఆహారాన్ని అందించాడు. చాలా మంది పేదవారిని బస్సులు, రైళ్లు, విమానాల సహాయంతో వారి గమ్య స్థానాలను చేర్చాడు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత పని కోల్పోయిన చాలా మందికి ఉద్యోగాలను కల్పించారు సోనూసూద్‌. ఇప్పటికీ తన సహాయ కార్యక్రమాలను వివిధ రకాలుగా ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో దేశం యావత్తు సోనూసూద్‌ను అభినందించారు. తాజాగా ఈ లిస్టులో హీరో విశాల్‌ కూడా చేరాడు. "గొప్ప మనసున్న సోదరుడు సోనూసూద్‌ను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దేవుడు నీకు గొప్ప దయను ప్రసాదించాడు. నీవు సమాజానికి చేసిన సేవ నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఇంకా నీవు ఆ సేవను కొనసాగిస్తున్నావు. నీవు చేస్తున్న సేవ  చూస్తుంటే మాటలు రావడం లేదు" అంటూ ట్విట్టర్‌లో సోనూసూద్‌ను కలిసిన ఫొటోను షేర్‌ చేశారు విశాల్‌. 


Updated Date - 2020-11-04T01:42:49+05:30 IST

Read more