మరోసారి విశాల్-ఆర్య!

ABN , First Publish Date - 2020-10-14T17:45:56+05:30 IST

తమిళ హీరోలు విశాల్, ఆర్య మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే.

మరోసారి విశాల్-ఆర్య!

తమిళ హీరోలు విశాల్, ఆర్య మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ దర్శకుడు బాలా రూపొందించిన `వాడు-వీడు` సినిమాలో కలిసి నటించారు. విశాల్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. `వరుడు`, పలు అనువాద సినిమాల ద్వారా ఆర్య కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. 


త్వరలో వీరిద్దరూ రెండోసారి కలిసి పనిచెయ్యబోతున్నారట. డైరెక్టర్ ఆనంద్ శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఈ సినిమాలో విశాల్ హీరోగా నటిస్తుండగా, ఆర్య విలన్ పాత్రలో కనిపించనున్నారట. టిక్ టాక్ స్టార్, `గద్దలకొండ గణేష్` సినిమాలో నటించిన మృణాళిని హీరోయిన్‌గా నటిస్తోందట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోందని సమాచారం. 


Updated Date - 2020-10-14T17:45:56+05:30 IST