విశాల్‌ 30... ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి

ABN , First Publish Date - 2020-11-06T18:10:19+05:30 IST

విశాల్, ఆర్య కాంబినేషన్లో ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది.

విశాల్‌ 30... ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి

విశాల్, ఆర్య కాంబినేషన్లో ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ  సినిమాలో విశాల్ హీరోగా నటిస్తుండగా, ఆర్య విలన్ నటిస్తున్నాడు. ఈ సినిమా రీసెంట్‌గానే హైదరాబాద్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేసుకుంది. గురువారం ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ విషయాన్ని విశాల్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. కోవిడ్‌ ప్రభావ సమయంలో ఇంటికే పరిమితమైన విశాల్‌ స్పీడు పెంచి చకచకా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ సినిమాతో పాటు డిటెక్టివ్‌ 2 చిత్రీకరణను విశాల్‌ ప్రారంభించబోతున్నారు. ఈ చిత్రంలో టిక్ టాక్ స్టార్, `గద్దలకొండ గణేష్` సినిమాలో నటించిన మృణాళిని హీరోయిన్‌గా నటిస్తుంది. 
Updated Date - 2020-11-06T18:10:19+05:30 IST