విరుష్క ప్రేమానుబంధం!

ABN , First Publish Date - 2020-11-06T19:36:25+05:30 IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శర్మ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు

విరుష్క ప్రేమానుబంధం!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శర్మ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల అనుష్క బేబి బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోహ్లీ గురువారం 32వ జన్మదినోత్సవం జరుపుకున్నాడు. 


ఆ సందర్భంగా అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. భర్తకు ఓ హగ్‌తో పాటు ఓ ముద్దును కూడా ఇచ్చింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు సైతం విరుష్క జోడీకి శుభాకాంక్షాలు తెలియజేశారు. Updated Date - 2020-11-06T19:36:25+05:30 IST