`విరాటపర్వం` మళ్లీ మొదలైంది!
ABN , First Publish Date - 2020-12-01T22:00:52+05:30 IST
వేణు ఉడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా, సాయిపల్లవి, ప్రియమణి తదితరులు నటిస్తున్న చిత్రం `విరాటపర్వం`.

వేణు ఉడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా, సాయిపల్లవి, ప్రియమణి తదితరులు నటిస్తున్న చిత్రం `విరాటపర్వం`. రానా అనారోగ్యం, లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు లాంగ్ గ్యాప్ వచ్చింది. ఎట్టకేలకు తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. `విరాటపర్వం`కు సంబంధించిన నైట్ షూటింగ్ వీడియోను రానా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు. 90వ దశకంలో తెలంగాణలోని నక్సల్ ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.