దేవతగా విమలా రామన్‌‌.. చూస్తే వావ్‌ అనాల్సిందే

ABN , First Publish Date - 2020-10-28T02:32:00+05:30 IST

హీరోయిన్‌ విమలా రామన్‌ అందరికీ సుపరిచితమే. గాయం 2, ఓం నమో వెంకటేశాయ, రాజ్‌ వంటి చిత్రాలలో ఆమె నటించింది. సరైన హిట్ ఒక్కటి పడినా.. ఈ భామ క్రేజ్‌

దేవతగా విమలా రామన్‌‌.. చూస్తే వావ్‌ అనాల్సిందే

హీరోయిన్‌ విమలా రామన్‌ అందరికీ సుపరిచితమే. గాయం 2, ఓం నమో వెంకటేశాయ, రాజ్‌ వంటి చిత్రాలలో ఆమె నటించింది. సరైన హిట్ ఒక్కటి పడినా.. ఈ భామ క్రేజ్‌ ఎక్కడికో వెళ్లిపోయేది. అదే ఆమెకు మైనస్‌ అయ్యింది. అయితేనేం సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ.. గ్లామర్‌ ఫొటోలతో అందరినీ తనవైపు చూసేలా చేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటో చూస్తే.. అంతా వావ్‌ అనాల్సిందే. ఎందుకంటే.. ఈ ఫొటోలో ఆమె అమ్మవారి రూపంలో, నటరాజ భంగిమలో ఇచ్చిన దర్శనం అబ్బుర పరిచేలా ఉంది. ఈ పిక్‌ పోస్ట్ చేసిన విమలా రామన్‌.. 'నీ శక్తిని క్షణం కూడా తీరికగా ఉండనీకు..' అని తెలుపుతూ.. తన ఈ రూపానికి కారణమైన మేకప్‌ మ్యాన్‌కు, ఫొటో గ్రాఫర్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఇక విమలా రామన్‌ ఈ పోస్ట్‌కు నెటిజన్లు కూడా వావ్‌.. అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.Updated Date - 2020-10-28T02:32:00+05:30 IST