విక్రమ్‌ప్రభుకు జోడీగా లక్ష్మీమీనన్‌

ABN , First Publish Date - 2020-09-29T20:39:49+05:30 IST

హీరో విక్రమ్‌ ప్రభు, అందాల భామ లక్ష్మీమీనన్‌ మరోమారు జంటగా నటించనున్నారు.

విక్రమ్‌ప్రభుకు జోడీగా లక్ష్మీమీనన్‌

హీరో విక్రమ్‌ ప్రభు, అందాల భామ లక్ష్మీమీనన్‌ మరోమారు జంటగా నటించనున్నారు. ‘సుందర పాండ్యన్‌’ చిత్రం ద్వారా తమిళ చిత్రసీమకు పరిచయమైన నటి లక్ష్మీమీనన్‌. ఆ తర్వాత ‘కుంకీ’, ‘కుట్టిపులి, చిత్రాలతో పాటు 2016లో విడుదలైన ‘రెక్క’ చిత్రంలో విజయ్‌సేతుపతికి జంటగా నటించింది. ఆ తర్వాత చదువుపై దృష్టిసారించి కొన్నేళ్ళు నటించడం మానేసింది. ప్రస్తుతం మళ్ళీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది. తాజాగా విక్రమ్‌ ప్రభు హీరోగా నటించనున్న ‘పేచ్చి’ అనే తమిళ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది.  ఈ చిత్రానికి ‘కొంబన్‌’ చిత్రదర్శకుడు ముత్తయ్య దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభమవుతుందని, నిర్మాణం పూర్తయ్యాక ఓటీటీలో విడుదల చేస్తామని దర్శకుడు ముత్తయ్య తెలిపారు.


Updated Date - 2020-09-29T20:39:49+05:30 IST