`కోబ్రా`: విక్రమ్ షాకింగ్ లుక్!
ABN , First Publish Date - 2020-12-25T20:32:36+05:30 IST
సినిమా కోసం ప్రాణం పెట్టే నటులలో తమిళ హీరో విక్రమ్ ముందు వరుసలో ఉంటాడు.

సినిమా కోసం ప్రాణం పెట్టే నటులలో తమిళ హీరో విక్రమ్ ముందు వరుసలో ఉంటాడు. అభిమానులకు థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించేందుకు, విభిన్న గెటప్‌లలో కనిపించేందుకు విక్రమ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించిన విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం `కోబ్రా`. ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్ 20కి పైగా విభిన్న గెటప్‌ల్లో కనిపించబోతున్నాడట.
క్రిస్మస్ సందర్భంగా `కోబ్రా` నుంచి విక్రమ్‌కు సంబంధించిన మరో లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో విక్రమ్ షాకింగ్ లుక్‌లో కనిపించాడు. అతని సగం మెదడులో ఎన్నో అంకెలు, సమస్యలు ఉన్నట్లు చూపించారు. `ప్రతీ సమస్యకు ఓ మ్యాథమెటికల్ సొల్యూషన్' ఉంటుందని పేర్కొన్నారు. ఈ సినిమాలో ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Read more