తండ్రీ కొడుకుల కాంబినేషన్..!
ABN , First Publish Date - 2020-06-05T17:05:34+05:30 IST
డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో విక్రమ్ ఓ సినిమా చేయబోతున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఇందులో విక్రమ్ తనయుడు ధ్రువ్ కూడా నటిస్తున్నాడని.

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. పాత్రలో ఒదిగిపోవడానికి ఎంతటి రిస్కైనా చేయడానికి సిద్ధపడే హీరోల్లో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ప్రస్తుతం ఈయన ‘కోబ్రా’ చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో విక్రమ్ ఓ సినిమా చేయబోతున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఇందులో విక్రమ్ తనయుడు ధ్రువ్ కూడా నటిస్తున్నాడని. తండ్రీ కొడుకుల కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయని వార్తలు వినపడుతున్నాయి. అనిరుధ్ సంగీతం అందించనున్నారని టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందంటున్నారు.