రాహు టీమ్‌కి శుభాకాంక్షలు చెప్పిన రాములమ్మ

ABN , First Publish Date - 2020-02-26T20:06:24+05:30 IST

రాహు చిత్ర బృందానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి శుభాకాంక్షలు తెలిపారు.

రాహు టీమ్‌కి శుభాకాంక్షలు చెప్పిన రాములమ్మ

రాహు చిత్ర బృందానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపిన రాములమ్మ.. హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యతను ఇస్తూ, కొత్త తరహా కథా వస్తువుతో చేసిన ఈ సినిమా 'రాహు' విజయవంతం కావాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. మరిన్ని వైవిధ్యభరితమైన చిత్రాల రూపకల్పనకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నానన్నారు. 


కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యంరాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా.. ఈ నెల ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మంచి టాక్ అందుకుంది. Updated Date - 2020-02-26T20:06:24+05:30 IST