నాయిని పోరాట స్ఫూర్తి మరిచిపోలేనిది: రాములమ్మ

ABN , First Publish Date - 2020-10-23T04:25:59+05:30 IST

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి (86) జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు మృతి చెందిన

నాయిని పోరాట స్ఫూర్తి మరిచిపోలేనిది: రాములమ్మ

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి (86) జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్త తెలిసిన పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటించారు. తాజాగా ఆయనతో కలిసి తెలంగాణ ఉద్యమానికి పనిచేసిన రాములమ్మ.. ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ.. నాయిని నరసింహారెడ్డికి మనఃపూర్వక నివాళి అర్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు.


''నాయిని నరసింహారెడ్డి అన్నకు మనఃపూర్వక నివాళి. తెలంగాణ ఉద్యమంలో కలసి పనిచేసిన మీపై నాకున్న ఆ గౌరవం ఎప్పటికీ విలువైనదే. నేను హాస్పిటల్‌లో ఉన్న సమయంలో డజన్ల సంఖ్యలో పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టి... ఉద్యమ సమయంలో కేసుల పేరుతో దాడి చేసినప్పుడు హోరాహోరీగా వారితో బరి గీసి నిలబెట్టి కొట్లాడిన మీ పోరాట స్ఫూర్తి మర్చిపోలేనిది.." అని విజయశాంతి ట్వీట్‌ చేశారు.  Updated Date - 2020-10-23T04:25:59+05:30 IST

Read more