టాలీవుడ్ మరో ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయింది: విజయశాంతి

ABN , First Publish Date - 2020-09-08T22:26:25+05:30 IST

ప్రముఖ సీనియర్‌ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి(74) మంగళవారం ఉదయం గుండెపోటుతో గుంటూరులో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై పలువురు

టాలీవుడ్ మరో ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయింది: విజయశాంతి

ప్రముఖ సీనియర్‌ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి(74) మంగళవారం ఉదయం గుండెపోటుతో గుంటూరులో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌ మరో ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయిందని అన్నారు నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి. సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆమె జయప్రకాశ్‌ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
"టాలీవుడ్ మరో ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయింది. రంగస్థలం మీద, వెండితెర పైన తనదైన ప్రత్యేకశైలి నటన, వాచకం, విభిన్నమైన పాత్రలతో ఎందరో అభిమానులను జయప్రకాశ్ రెడ్డి సంపాదించుకున్నారు. మా స్వంత నిర్మాణ సంస్థల్లో కూడా 3 చిత్రాలలో నటించి మెప్పించిన ఆయనతో చివరిగా 'సరిలేరు నీకెవ్వరు' కలసి నటించాను. జయప్రకాశ్ రెడ్డి గారి విలక్షణ నటన చిరకాలం గుర్తుండిపోతుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

-విజయశాంతి" అని విజయశాంతి తన సోషల్ మీడియా‌ అకౌంట్స్‌లో పోస్ట్ చేశారు.Updated Date - 2020-09-08T22:26:25+05:30 IST