విజయ్‌ యేసుదాస్‌కి రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2020-11-04T02:36:30+05:30 IST

ప్రముఖ సినీ గాయకుడు నటుడు, విజయ్‌ యేసుదాస్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే పొమవారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు.

విజయ్‌ యేసుదాస్‌కి రోడ్డు ప్రమాదం

ప్రముఖ సినీ గాయకుడు నటుడు, విజయ్‌ యేసుదాస్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే పొమవారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు. తన స్నేహితుడితో తిరువనంతపురం రాజధాని కోచికి సోమవారం రాత్రి విజయ్‌ యేసుదాస్‌ బయలుదేరారు. ఆయన డ్రైవ్‌ చేస్తున్నారు. జాతీయ రహదారిపై ఉన్నట్లుండి మరో కారు రావడంతో రెండు కార్లు ఢీ కొట్టుకున్నాయి. అయితే ప్రమాదంలో విజయ్‌ యేసుదాస్‌ సహా ఢీకొన్న కారులోని వారికి కూడా ఏమీ కాలేదు. కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విజయ్‌ యేసుదాస్‌ మరో కారులో కోచికి వెళ్లారు. 


Updated Date - 2020-11-04T02:36:30+05:30 IST