ట్రోలింగ్ అంటే నాకిష్టం: విజయ్ దేవరకొండ

ABN , First Publish Date - 2020-02-14T19:29:14+05:30 IST

`అర్జున్‌రెడ్డి` సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ.

ట్రోలింగ్ అంటే నాకిష్టం: విజయ్ దేవరకొండ

`అర్జున్‌రెడ్డి` సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. తన ఆటిట్యూడ్, బిహేవియర్‌తో ఎంత మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడో, అంతే స్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొంటుంటాడు. విజయ్ నటించిన `వరల్డ్ ఫేమస్ లవర్` సినిమా ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో తనపై జరిగే ట్రోలింగ్ గురించి విజయ్ మాట్లాడాడు. `ట్రోలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ట్రోల్స్ నాకు మంచి కిక్ ఇస్తుంటాయి. నెటిజన్లు తమ విలువైన సమయాన్ని నా సినిమాలు, స్టైల్‌ను విమర్శించేందుకు ఉపయోగిస్తున్నారు. నేను వారికి చాలా నిద్రలేని రాత్రులు ఇస్తున్నాను. వారి కలల్లోకి కూడా నేను వస్తున్నానేమోన`ని విజయ్ వ్యాఖ్యానించాడు.  

Updated Date - 2020-02-14T19:29:14+05:30 IST