బాలీవుడ్‌కు విజ‌య్ సేతుప‌తి చిత్రం

ABN , First Publish Date - 2020-05-12T18:41:44+05:30 IST

అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో యువతారలు అశోక్‌సెల్వన్‌, రిత్వికసింగ్‌, వాణి భోజన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ మై కడవులే’. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇందులో అతిథి పాత్రలో నటించారు.

బాలీవుడ్‌కు విజ‌య్ సేతుప‌తి చిత్రం

అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో యువతారలు అశోక్‌సెల్వన్‌, రిత్వికసింగ్‌, వాణి భోజన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ మై కడవులే’. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇందులో అతిథి పాత్రలో నటించారు. లాక్‌డౌన్‌కు కొన్ని రోజుల ముందు విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే లాక్‌డౌన్‌ ప్రకటించాక థియేటర్లు మూతపడడంతో ఈ చిత్రానికి నిరాశే మిగిలింది. ఇటీవల ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల చేయగా, బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ కూడా దక్కింది. ఈ నేపథ్యంలో ‘ఓ మై కడవులే’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రీమేక్‌ విషయమై చర్చలు జరుగు తున్నాయని దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు తెలిపారు. 

Updated Date - 2020-05-12T18:41:44+05:30 IST