గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న విజయ్ సేతుపతి

ABN , First Publish Date - 2020-07-27T19:10:41+05:30 IST

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి పాల్గొన్నారు. ‘ఉప్పెన’ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సాన ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సోమవారం చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు విజయ్ సేతుపతి.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న విజయ్ సేతుపతి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడ‌త‌కు సామాన్యుల నుండే కాదు.. సినీ ప్ర‌ముఖుల నుండి కూడా మంచి స్పంద‌న వ‌స్తుంది. తాజాగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి పాల్గొన్నారు. ‘ఉప్పెన’ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సాన ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సోమవారం చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు విజయ్ సేతుపతి. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి   కార్యక్రమాన్ని చేపట్టారు. వాతావరణ కాలుష్యం తగ్గడం కోసం మొక్కలు నాటుతున్నారు. అందులో భాగంగా నేను కూడా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో నన్ను భాగం చేసిన సంతోష్‌గారికి, బుచ్చిబాబుగారికి థాంక్స్’’ అన్నారు. ‘ఉప్పెన’ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నా  అభిమానులు అందరూ కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు విజయ్ సేతుపతి.



Updated Date - 2020-07-27T19:10:41+05:30 IST

Read more