డ‌బ్బింగ్ స్టార్ట్ చేసిన విజ‌య్ సేతుప‌తి!!

ABN , First Publish Date - 2020-07-31T19:54:50+05:30 IST

విజ‌య్ సేతుప‌తి, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘లాభం’. ఈ సినిమాకు సంబంధించిన డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లు పెట్టారు విజయ్ సేతుపతి.

డ‌బ్బింగ్ స్టార్ట్ చేసిన విజ‌య్ సేతుప‌తి!!

లాక్‌డౌన్ నుండి సినిమా షూటింగ్‌ల‌కు విధివిధానాల‌తో అనుమ‌తి ఇచ్చిన ప్ర‌భుత్వాలు నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేసుకోవ‌డానికి అనుమ‌త‌లు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా విజ‌య్ సేతుప‌తి, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘లాభం’. ఈ సినిమాకు సంబంధించిన డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లు పెట్టారు విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి నిర్మాణ సంస్థతో పాటు 7పీఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్‌పై ‘లాభం’ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. జ‌న‌నాథ‌న్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావ‌చ్చింది. మిగిలిన షూటింగ్ పూర్తి చేసేలోపు సినిమా డ‌బ్బింగ్‌, ఇత‌ర పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేయాల‌ని మేక‌ర్స్ భావించ‌డంతో డ‌బ్బింగ్ కార్యక్ర‌మాలు స్టార్ట్ అయ్యాయి. 

Updated Date - 2020-07-31T19:54:50+05:30 IST