విజయ్ అరుదైన రికార్డ్.. ఈ ఏడాది బ్రేక్!

ABN , First Publish Date - 2020-10-08T14:41:45+05:30 IST

కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ మొత్తం స్తంభించిపోయింది. థియేటర్లు, సినిమా షూటింగ్‌లు పూర్తిగా బంద్ అయిపోయాయి.

విజయ్ అరుదైన రికార్డ్.. ఈ ఏడాది బ్రేక్!

కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ మొత్తం స్తంభించిపోయింది. థియేటర్లు, సినిమా షూటింగ్‌లు పూర్తిగా బంద్ అయిపోయాయి. ఈ నెల 15 నుంచి థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి లభించినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అనేది అనుమానాస్పదంగా మారింది. దీంతో సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలెవరూ ముందుకు రావడం లేదు. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన `మాస్టర్` సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్నప్పటికీ విడుదలకు చిత్రయూనిట్ ఇష్టపడలేదు. 


`మాస్టర్` సినిమా ఈ ఏడాది విడుదల కాదని నిర్మాతలు స్పష్టం చేశారు. దీంతో విజయ్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డు బ్రేక్ అయింది. సినీ కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి విజయ్ ఏడాదికి రెండు, కనీసం ఒక్క సినిమానైనా విడుదల చేస్తున్నాడు. తన 27 ఏళ్ల కెరీర్‌లో విజయ్ ఇప్పటివరకు హీరోగా 64 సినిమాల్లో నటించాడు. గత 27 ఏళ్లలో విజయ్ ఒక్క సంవత్సరాన్ని కూడా జీరో ఇయర్‌గా విడిచిపెట్టలేదు. స్టార్ హీరోల విషయంలో ఇది అరుదైన రికార్డు. కరోనా కారణంగా ఈ ఏడాది ఆ రికార్డుకు బ్రేక్ పడింది. ఈ ఏడాది క్రిస్మస్‌కు `మాస్టర్`ను విడుదల చేస్తారని విజయ్ అభిమానులు భావించారు. అయితే ఈ ఏడాది విడుదల ఉండదని యూనిట్ స్పష్టం చేయడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.    

Updated Date - 2020-10-08T14:41:45+05:30 IST