తన తల్లికి మాటిచ్చిన విజయ్‌ దేవరకొండ

ABN , First Publish Date - 2020-09-24T22:52:28+05:30 IST

అతి తక్కువ సమయంలో క్రేజీ స్టార్‌గా గుర్తింపు పొందిన హీరో రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ. కొందరు స్టార్‌ హీరోలకు దక్కని అవకాశం ఆయన

తన తల్లికి మాటిచ్చిన విజయ్‌ దేవరకొండ

అతి తక్కువ సమయంలో క్రేజీ స్టార్‌గా గుర్తింపు పొందిన హీరో రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ. కొందరు స్టార్‌ హీరోలకు దక్కని అవకాశం ఆయన అతి తక్కువ వ్యవధిలోనే సాధించారు. పాన్‌ ఇండియా లెవల్‌లో ఆయన గుర్తింపును పొందారు. బాలీవుడ్‌ హీరోయిన్లు సైతం.. విజయ్‌ దేవరకొండతో నటించాలని ఉందని చెప్పడం చూస్తుంటే.. ఆయన క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా విజయ్‌ దేవరకొండ తన తల్లికి సోషల్‌ మీడియా వేదికగా ఒక మాట ఇచ్చారు.


విజయ్‌ దేవరకొండ తల్లి‌ మాధవి దేవరకొండ 50వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌ ద్వారా ఓ వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోలో మాధవి దేవరకొండ క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకుని షాట్‌ కొడుతుండగా.. పక్కన తన కుమారులు.. విజయ్‌, ఆనంద్‌లు కూడా షాట్‌ కొడుతున్నట్లుగా పోజిచ్చారు. అనంతరం మాధవి దేవరకొండ 50(50వ పుట్టినరోజు) కొట్టినట్లుగా బ్యాట్‌ని పైకి ఎత్తడంతో.. కుమారులు క్లాప్స్ కొట్టారు. ఈ వీడియో షేర్‌ చేసిన విజయ్‌ దేవరకొండ.. తన తల్లిని ఎప్పటికీ సంతోషంగా ఉంచుతానని చెబుతూ ప్రామిస్‌ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Updated Date - 2020-09-24T22:52:28+05:30 IST