సంక్రాంతి రేసులో 'మాస్టర్'.. త్వరలోనే టీజర్
ABN , First Publish Date - 2020-10-05T19:16:27+05:30 IST
'మాస్టర్' టీజర్‌ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాత గ్జేవియర్ బ్రిట్టో తెలియజేశారు.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నగరం, ఖైదీ చిత్రాల దర్శకుడు లొకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మాస్టర్'. తమిళంతో పాటు తెలుగులోనూ సినిమా ఏక కాలంలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేశారు. కానీ కోవిడ్ ప్రభావంతో సినిమా విడుదల వాయిదా పడింది. లాక్‌డౌన్ సమయంలో థియేటర్స్ ఓపెన్ అయ్యే విషయంలో క్లారిటీ రాకపోవడంతో సినిమా ఓటీటీ విడుదలవుతుందని, ఓ ప్రముఖ డిజిటల్ సంస్థ భారీ మొత్తంలో భారీ మొత్తం చెల్లించి సినిమాను డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయనుందంటూ వార్తలు వినిపించాయి. అయితే మేకర్స్ ఈ వార్తలను ఖండిస్తూనే వచ్చారు. థియేటర్స్‌లోనే మాస్టర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు థియేటర్స్ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో 'మాస్టర్' చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాత గ్జేవియర్ బ్రిట్టో తెలియజేశారు.