ఇంటివద్దకే సినిమా థియేటర్
ABN , First Publish Date - 2020-12-18T05:00:47+05:30 IST
కరోనా మహమ్మారి వల్ల బయటకు వెళ్లడానికి భయపడుతున్న వాళ్ల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ ఇంట్లోనే అందజేసేందుకు ఏటీటీ ప్లాట్‌ఫామ్ సిద్ధమైందని ఫ్రైడే యాప్ ఏటీటీ ప్రమోటర్స్ విజయ్ మద్దూరి, అనురాగ్ పర్వతనేని తెలిపారు...

విజయ్ మద్దూరి, అనురాగ్ పర్వతనేని
కరోనా మహమ్మారి వల్ల బయటకు వెళ్లడానికి భయపడుతున్న వాళ్ల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ ఇంట్లోనే అందజేసేందుకు ఏటీటీ ప్లాట్‌ఫామ్ సిద్ధమైందని ఫ్రైడే యాప్ ఏటీటీ ప్రమోటర్స్ విజయ్ మద్దూరి, అనురాగ్ పర్వతనేని తెలిపారు. ‘‘ఇందుతో తొలి సినిమాగా ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన ‘డర్టీ హరి’ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సినిమా చూడాలనుకునేవారు రూ. 120 టిక్కెట్ ధర చెల్లించవలసి ఉంటుంది’’ అని అనురాగ్ తెలిపారు.