అప్పుడు ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్నా: విజయ్ దేవరకొండ

ABN , First Publish Date - 2020-04-20T22:48:56+05:30 IST

దర్శకుడిగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు పూరీ జగన్నాధ్‌కు ప్రముఖులందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏప్రిల్ 20న

అప్పుడు ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్నా: విజయ్ దేవరకొండ

దర్శకుడిగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు పూరీ జగన్నాధ్‌కు ప్రముఖులందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏప్రిల్ 20న విడుదలైన పవన్ కల్యాణ్ ‘బద్రి’ సినిమాతో పూరీ జగన్ దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ప్రస్తుతం పూరీ ‘ఫైటర్’ (ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు) అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరో. తాజాగా విజయ్ దేవరకొండ ‘బద్రి’ సినిమా టైమ్‌లో ఏం చేస్తుందీ తెలుపుతూ.. ప్రస్తుతం తను మూవీ చేస్తున్న దర్శకుడైన పూరీ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


‘‘20 సంవత్సరాల క్రితం ‘బద్రి’ సినిమాను థియేటర్‌లో చూశాను. అప్పుడు ఆరవ తరగతి చదువుతున్నాను. ఆ తర్వాత ఆ సినిమాలోని ‘హే చికీతా..’ పాటను చాలా కాలం పాడాను. ప్రస్తుతం మిమ్మల్ని, మన సినిమా షూటింగ్‌ని మిస్ అవుతున్నాను. నేను నటుడిగా రిటైర్ అయ్యే వరకు మీరు ఆరోగ్యంగా ఉండి, ఇలాగే సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. 20 ఇయర్స్ ఆఫ్ పూరీ జగన్’’ అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.Updated Date - 2020-04-20T22:48:56+05:30 IST