న్యూ రికార్డు క్రియేట్ చేసిన రౌడీ హీరో

ABN , First Publish Date - 2020-12-24T23:33:23+05:30 IST

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ అకౌంట్‌లో వరుసబెట్టి రికార్డులు పడుతున్నాయి. ఫాలోయింగ్‌ విషయంలో ఇప్పటికే బాలీవుడ్‌ స్థాయిని చేరుకున్న విజయ్‌ దేవరకొండ

న్యూ రికార్డు క్రియేట్ చేసిన రౌడీ హీరో

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ అకౌంట్‌లో వరుసబెట్టి రికార్డులు పడుతున్నాయి. ఫాలోయింగ్‌ విషయంలో ఇప్పటికే బాలీవుడ్‌ స్థాయిని చేరుకున్న విజయ్‌ దేవరకొండ ఇప్పుడు మరో నూతన రికార్డ్‌ను క్రియేట్‌ చేశాడు. సౌత్ ఇండియన్ సెన్సేషనల్ స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ సోషల్‌ మీడియా ఇన్‌స్టాగ్రమ్‌లో మరో మైలు రాయిని చేరుకున్నారు. ఇన్‌స్టాగ్రమ్‌లో ఏకంగా కోటి మంది ఫాలోవర్స్ దక్కింకుకొని రికార్డు సృష్టించాడు. సౌత్ ఇండియన్ స్టార్స్ లలో కోటి మంది ఫాలోవర్స్ ఉన్న నటుడు ఈ రౌడీ హీరోనే కావడం విశేషం. ఈ అరుదైన రికార్డును ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ‘1 క్రోర్ ఇన్ స్టా రౌడీస్’ అనే ట్యాగ్‌తో వరల్డ్ వైడ్ గా సోషల్ మీడియా అంతా ట్రెండింగ్ చేస్తున్నారు. 


విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన డిఫరెంట్ యాటిట్యూడ్, స్టైల్‌తో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను విజయ్‌ క్రియేట్ చేసుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా తనదైన స్టైల్లో క్రియేటివ్‌గా పోస్ట్ లు పెడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.అందుకే ఇంతమంది విజయ్‌కు ఫిదా అయ్యారు. తను ఓ ఫోటో పెట్టినా, వీడియో పెట్టినా లైకులు, కామెంట్లతో అభిమానులు ప్రేమ కురిపిస్తున్నారు. విజయ్ కూడా 10 మిలియన్ ఫాలోవర్స్ పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పూరీ జగన్నాధ్‌తో ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్న ఈ రౌడీ.. ఆ తర్వాత శివ నిర్వాణ, సుకుమార్ డైరెక్షన్లలో సినిమాలు చేయనున్నాడు.

Updated Date - 2020-12-24T23:33:23+05:30 IST