నన్ను ఇంట్లో పనులు చేయనీయట్లే!

ABN , First Publish Date - 2020-04-25T05:37:30+05:30 IST

‘‘ఇంట్లో మమ్మల్ని ఇంకా రియల్‌ మెన్‌లా చూడట్లేదు. పిల్లల్లానే ట్రీట్‌ చేస్తున్నారు. అయినా సరే... లాక్‌డౌన్‌లో రోజూ నా జీవితం ఎలా ఉంటుందో త్వరలో మీకు చూప్తిస్తా...

నన్ను ఇంట్లో పనులు చేయనీయట్లే!

‘‘ఇంట్లో మమ్మల్ని ఇంకా రియల్‌ మెన్‌లా చూడట్లేదు. పిల్లల్లానే ట్రీట్‌ చేస్తున్నారు. అయినా సరే... లాక్‌డౌన్‌లో రోజూ నా జీవితం ఎలా ఉంటుందో త్వరలో మీకు చూప్తిస్తా... చిన్న వీడియో రూపంలో’’ అని విజయ్‌ దేవరకొండ అన్నారు. అతడికి దర్శకుడు కొరటాల శివ ‘బీ ద రియల్‌మేన్‌’ ఛాలెంజ్‌ విసిరారు. చలనచిత్ర ప్రముఖులు చాలామంది ఇంటి పనుల్లో మహిళలకు సాయం చేస్తూ... వీడియో తీసుకుని ‘బీ ద రియల్‌మేన్‌’ ఛాలెంజ్‌లో భాగంగా సామాజిక మాధ్యమాల్లో ప్రేక్షకులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. విజయ్‌ దేవరకొండను సైతం ఆ విధంగా చేయమని కొరటాల శివ కొరగా... ‘‘శివ సార్‌! మా మమ్మీ నన్ను పని చేయనివ్వడం లేదు. పని రెండింతలు అవుతుందట. ఇంట్లో పిల్లల్లా ట్రీట్‌ చేస్తున్నారు. అయినా... పనులు చేస్తా’’ అని బదులిచ్చారు.

Updated Date - 2020-04-25T05:37:30+05:30 IST