విజయ్ దేవరకొండ పేరుతో ఛాటింగ్ .. రంగంలోకి రౌడీ
ABN , First Publish Date - 2020-03-04T21:09:55+05:30 IST
సాంకేతిక పెరిగిన కొద్దీ కొత్త సమస్యలు వస్తున్నాయి. కొత్త తరహా మోసగాళ్లు పుట్టుకొస్తున్నారు. కొత్త కొత్త మోసాలు చేస్తున్నారు.

సాంకేతిక పెరిగిన కొద్దీ కొత్త సమస్యలు వస్తున్నాయి. కొత్త తరహా మోసగాళ్లు పుట్టుకొస్తున్నారు. కొత్త కొత్త మోసాలు చేస్తున్నారు. తాజాగా ఓ ప్రబుద్ధుడు హీరో విజయ్ దేరవకొండ పేరిట మోసం చేయాలనుకుని అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకెళ్తే.. విజయ్ దేవరకొండ పేరిట ఓ నకిలీ ఫేస్‌బుక్ పేజీని క్రియేట్ చేశాడో వ్యక్తి. అందరికీ ఫ్రెండ్స్ రిక్వెస్ట్‌లు పంపేవాడు. ముఖ్యంగా అమ్మాయిలకు రిక్వెస్ట్‌లను పంపేవాడు. అమ్మాయిలతో విజయ్‌దేవర కొండలా ఛాటింగ్ చేసేవాడు. తర్వాత తన డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో ఛాటింగ్ చేయాలని అతను చేసిన సిఫార్సుల ఆధారంగానే నేను ఛాటింగ్ చేస్తానంటూ విజయ్ దేవరకొండలా మాయమాటలు చెప్పేవాడు. తన ఫోన్‌తోనే తనే విజయ్ దేరవకొండ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెబుతూ ఛాటింగ్ చేసేవాడు. ప్రేమ, పెళ్లి, సహజీవనం పేరిట అమ్మాయిలకు ఎర వేసేవాడు.
అయితే ఈ వ్యవహారం ఎంతో కాలం కొనసాగలేదు. స్నేహితుల ద్వారా విషయం విజయ్ దేవరకొండకు చేరింది. వెంటనే అలర్ట్ అయిన విజయ్.. తన అసిస్టెంట్ వ్యాస్‌ను రంగంలోకి దింపాడు. విజయ్ సదరు నకిలీ వ్యక్తితో అమ్మాయిగా పరిచయం చేసుకుని ఛాటింగ్ చేశాడు. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో విజయ్ దేవరకొండ అసిస్టెంట్ వ్యాస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read more