15 కిలోలు తగ్గిన విజయ్‌ ఆంటోని

ABN , First Publish Date - 2020-08-02T19:29:14+05:30 IST

‘బిచ్చ‌గాడు 2’ చిత్రం కోసం హీరో విజయ్‌ ఆంటోని బరువు తగ్గి స్లిమ్‌గా తయారయ్యారు. విజయ్‌ ఆంటోని నటించిన చిత్రాలలో ‘బిచ్చ‌గాడు’ కలెక్షన్ల వర్షం కురిపించింది.

15 కిలోలు తగ్గిన విజయ్‌ ఆంటోని

‘బిచ్చ‌గాడు 2’ చిత్రం కోసం హీరో విజయ్‌ ఆంటోని బరువు తగ్గి స్లిమ్‌గా తయారయ్యారు. విజయ్‌ ఆంటోని నటించిన చిత్రాలలో ‘బిచ్చ‌గాడు’ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ‘పిచ్చైక్కారన్‌’ రెండో భాగం తీయడానికి విజయ్‌ ఆంటోని సొంత చిత్రనిర్మాణ సంస్థ సిద్ధమైంది. ‘పిచ్చైక్కారన్‌-2’గా త‌మిళంలో, ‘బిచ్చగాడు 2’గా తెలుగులో సినిమా రూపొందుతుంది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు పొందిన ‘భారమ్‌’ చిత్ర డైరెక్టర్‌  ప్రియా కృష్ణసామి దర్శకత్వం వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాత ఫాతిమా విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ విజయ్‌ ఆంటోని సరసన నిత్యామేనన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయాలని అనుకుంటున్నామన్నారు. నిత్యామేనన్‌ కాల్షీట్లు లభించకపోతే ఆమెలాగే నటించగల మరో హీరోయిన్‌ను ఎంపిక చేస్తామన్నారు. ఈ చిత్రం కోసం విజయ్‌ ఆంటోని కఠోర వ్యాయామంతో 15 కిలోలు  బరువు తగ్గారని ఆమె తెలిపారు.


Updated Date - 2020-08-02T19:29:14+05:30 IST