సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

10 మిలియన్ మార్క్.. విజయ్ భావోద్వేగం!

ABN, First Publish Date - 2020-12-25T16:08:32+05:30

సోషల్ మీడియాలో యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజ్ రోజురోజుకూ మరింత పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియాలో యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజ్ రోజురోజుకూ మరింత పెరుగుతోంది. సోషల్ మీడియాలో విజయ్ మరో సరికొత్త రికార్డు సాధించాడు. దక్షిణాదిన ఏ స్టార్‌కూ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్ల (కోటి)కు చేరింది. 


ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన ఏకైక దక్షిణాది స్టార్‌గా విజయ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ నేపథ్యంలో విజయ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. `ఇది పెద్ద విషయమా.. కావచ్చు. దీని వల్ల ఏమైనా మారుతుందా.. లేదు. పది మంది ఉన్నా పది మిలియన్ల మంది ఉన్నా నేను ఒకేలా ప్రేమిస్తా. ఎప్పటికీ మీరంతా నా రౌడీ లవ్స్` అని కామెంట్ చేశాడు. 



Updated Date - 2020-12-25T16:08:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!