10 మిలియన్ మార్క్.. విజయ్ భావోద్వేగం!

ABN , First Publish Date - 2020-12-25T16:08:32+05:30 IST

సోషల్ మీడియాలో యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజ్ రోజురోజుకూ మరింత పెరుగుతోంది.

10 మిలియన్ మార్క్.. విజయ్ భావోద్వేగం!

సోషల్ మీడియాలో యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజ్ రోజురోజుకూ మరింత పెరుగుతోంది. సోషల్ మీడియాలో విజయ్ మరో సరికొత్త రికార్డు సాధించాడు. దక్షిణాదిన ఏ స్టార్‌కూ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్ల (కోటి)కు చేరింది. 


ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన ఏకైక దక్షిణాది స్టార్‌గా విజయ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ నేపథ్యంలో విజయ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. `ఇది పెద్ద విషయమా.. కావచ్చు. దీని వల్ల ఏమైనా మారుతుందా.. లేదు. పది మంది ఉన్నా పది మిలియన్ల మంది ఉన్నా నేను ఒకేలా ప్రేమిస్తా. ఎప్పటికీ మీరంతా నా రౌడీ లవ్స్` అని కామెంట్ చేశాడు. Updated Date - 2020-12-25T16:08:32+05:30 IST