విజయ్‌కు నచ్చిన హీరో ఎవరో తెలుసా?
ABN , First Publish Date - 2020-05-02T21:34:08+05:30 IST
`పెళ్లిచూపులు` సినిమాతో తెలుగునాట గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ
`పెళ్లిచూపులు` సినిమాతో తెలుగునాట గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ `అర్జున్ రెడ్డి`తో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమా `ఫైటర్`లో నటిస్తున్నాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన అభిమాన హీరో గురించి విజయ్ మాట్లాడాడు.
`నటుడిగా మీకు స్ఫూర్తి ఎవరు?` అనే ప్రశ్నకు స్పందిస్తూ.. `రణ్‌బీర్ కపూర్ నాకు ఇష్టమైన నటుడు. నేను ఎక్కువగా ఫాలో అయ్యే వారిలో రణ్‌బీర్ ముందు వరుసలో ఉంటాడు. అతని స్టైల్, నటన బాగా ఇష్టపడతాన`ని చెప్పాడు. ఒకవేళ తను నటుడు కాకపోయుంటే ఆర్కిటెక్ట్ అయ్యేవాడినని చెప్పాడు. అలాగే ఇటీవల `ఫౌధా`, `చీర్` డాక్యుమెంటరీలను చూసినట్టు తెలిపాడు.