`నా పిల్లలకు జన్మనివ్వబోయే తల్లి` అంటూ నయన్‌ గురించి విఘ్నేష్ కామెంట్!

ABN , First Publish Date - 2020-05-11T18:57:27+05:30 IST

లేడీ సూపర్‌స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నయనతార కొద్ది కాలంగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం

`నా పిల్లలకు జన్మనివ్వబోయే తల్లి` అంటూ నయన్‌ గురించి విఘ్నేష్ కామెంట్!

లేడీ సూపర్‌స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నయనతార కొద్ది కాలంగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఇప్పటివరకు తమ బంధంపై బహిరంగంగా స్పందించలేదు. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంటారు. 


తాజాగా మదర్స్ డే సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో విఘ్నేష్ శివన్ చేసిన కామెంట్ హాట్ టాపిక్‌గా మారింది. ఓ పాపను ఎత్తుకున్న నయన్ ఫొటోను పోస్ట్ చేసి.. `నా పిల్లలకు జన్మనివ్వబోయే తల్లి చేతుల్లో ఉన్న పాప తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు` అని కామెంట్ చేశాడు. దీంతో విఘ్నేష్, నయన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ మరోసారి వార్తలు జోరందుకున్నాయి. అలాగే తన తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసిన విఘ్నేష్.. నయనతార తల్లికి కూడా విషెస్ చెప్పాడు.




Updated Date - 2020-05-11T18:57:27+05:30 IST