అవును.. నా పారితోషికం ఎక్కువే: విద్యా బాలన్

ABN , First Publish Date - 2020-07-31T02:23:51+05:30 IST

అద్భుతమైన నటనతో, విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది హీరోయిన్ విద్యా బాలన్.

అవును.. నా పారితోషికం ఎక్కువే: విద్యా బాలన్

అద్భుతమైన నటనతో, విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది హీరోయిన్ విద్యా బాలన్. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలను మాత్రమే చేస్తున్న విద్య తాజాగా గణిత మేధావి `శకుంతలా దేవి` బయోపిక్‌లో నటించింది. అమేజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది. 


ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్య తన పారితోషికం గురించి మాట్లాడింది. `పారితోషికాల్లో వివక్ష గురించి మిగతా హీరోయిన్లు ఏమనుకుంటారో నాకు తెలియదు. కానీ, నా సినిమాల్లో అందరి కంటే ఎక్కువ పారితోషికం నాకే అందుతుంది. నేను గత 12 ఏళ్లుగా మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేస్తున్నాను. నా పేరు మీదే మార్కెట్ జరుగుతుంది. పైగా సీనియర్ నటిని. కాబట్టి నాకు ఎక్కువగానే ఇస్తారు. అయితే నా తరహా సినిమాలు చూసుకున్నా.. హీరోలకు, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికం విషయంలో తేడా ఉంటుంద`ని విద్య చెప్పింది. 

Updated Date - 2020-07-31T02:23:51+05:30 IST