బాబాయ్‌ చిత్రంలో భార్యగా... అబ్బాయ్‌ చిత్రంలో మావోయిస్టుగా!

ABN , First Publish Date - 2020-04-25T05:40:46+05:30 IST

తెలుగులో ప్రస్తుతం ప్రియమణి రెండు చిత్రాలు చేస్తున్నారు. అందులో వెంకటేశ్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘నారప్ప’ ఒకటి. రానా దగ్గుబాటి హీరోగా...

బాబాయ్‌ చిత్రంలో భార్యగా... అబ్బాయ్‌ చిత్రంలో మావోయిస్టుగా!

తెలుగులో ప్రస్తుతం ప్రియమణి రెండు చిత్రాలు చేస్తున్నారు. అందులో వెంకటేశ్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘నారప్ప’ ఒకటి. రానా దగ్గుబాటి హీరోగా ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్‌ వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘విరాటపర్వం’ మరొకటి. బాబాయ్‌ చిత్రంలో ఆయనకు భార్యగా నటిస్తుండగా, అబ్బాయ్‌ చిత్రంలో మావోయిస్టుగా కనిపించనున్నారు. ఈ రెండు చిత్రాల గురించి ప్రియమణి మాట్లాడుతూ ‘‘ధనుష్‌ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘అసురన్‌’కి ‘నారప్ప’ రీమేక్‌ అయినా... తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొన్ని మార్పులు చేశారు. అవన్నీ తెలుగు భాషకు తగ్టట్టు కథలో భాగంగా ఉంటాయి. ‘విరాటపర్వం’ విషయానికి వస్తే... మావోయిస్టులు, విప్లవ పోరాటాల నేపథ్యంలో 90లలో సాగే కథతో రూపొందుతోంది. అందులో నేను మావోయిస్టుగా నటిస్తున్నా. నా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ  ఇంకా పూర్తి కాలేదు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత అన్ని షూటింగులు మళ్లీ రీషెడ్యూల్‌ అవుతాయి’’ అన్నారు.

Updated Date - 2020-04-25T05:40:46+05:30 IST