ట్రెండ్‌ సెట్టర్‌కు హ్యాపీ బర్త్‌డే

ABN , First Publish Date - 2020-12-13T02:08:58+05:30 IST

టాలీవుడ్ లో విజ‌యం కావాల‌ని హీరోలంతా కష్టపడతారు. కానీ, విజ‌యాన్నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు విక్టరీ వెంకటేశ్. డిసెంబర్‌ 13 ఈ 'బొబ్బిలి రాజా' పుట్టిన రోజు. ఈ సందర్భంగా

ట్రెండ్‌ సెట్టర్‌కు హ్యాపీ బర్త్‌డే

టాలీవుడ్ లో విజ‌యం కావాల‌ని హీరోలంతా  కష్టపడతారు. కానీ, విజ‌యాన్నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు విక్టరీ వెంకటేశ్. డిసెంబర్‌ 13 ఈ  'బొబ్బిలి రాజా' పుట్టిన రోజు. ఈ సందర్భంగా విక్టరీ వీరుడికి బెస్ట్ విషెస్ చెబుతూ... ఆయన స్పెక్టాక్యులర్ జర్నీపై ఓ లుక్కేద్దాం. 1960 డిసెంబర్ 13న కారంచేడులో జన్మించిన వెంకటేష్  1971లోనే ‘ప్రేమ్‌ నగర్‌’ చిత్రంలో బాలనటుడిగా నటించాడు. 1986లో  కె.రాఘవేంద్రరావు  దర్శకత్వంలో  తెరకెక్కిన ‘కలియుగ పాండవులు’ సినిమాతో రామానాయుడు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి  అడుగు పెట్టాడు. నిర్మాత కొడుకు స్టార్ అవ్వ‌డం అప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో జ‌ర‌గ‌లేదు. కానీ వెంకటేష్  వ‌చ్చిన త‌ర్వాత అన్నీ మారాయి. తొలి సినిమా 'క‌లియుగ పాండ‌వులు'తోనే సంచ‌ల‌నం సృష్టించ‌డంతో పాటు డెబ్యూ యాక్టర్ క్యాటగిరీలో నంది అవార్డు దక్కించుకున్నాడు. మొదటి సినిమా సక్సెస్ తరువాత ‘స్వర్ణ కమలం’ మరో పెద్ద టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. విశ్వనాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా వెంకీ కెరియర్ లో మెమరబుల్ మైల్ స్టోన్.


కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లీష్ అవుతున్న టైమ్‌లోనే‘ధర్మచక్రం’ వంటి పెర్మామెన్స్  ఓరియెంటెడ్ సినిమా చేసి అందరి చేత ఆహా అనిపించుకున్నాడు వెంకటేశ్. 'బ్రహ్మపుత్రుడు', 'శత్రువు' వంటి సినిమాలతో మరింత సత్తా చాటాడు. ఇక ‘బొబ్బిలి రాజా’ వెంకీ కెరీర్ లో అల్టిమేట్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కి... ఆల్ టైం టాలీవుడ్ మూవీస్ లో ఒకటిగా మారిపోయింది.‘చంటి’ సినిమాతో మరోసారి పెద్ద సాహసమే చేశాడు వెంకటేష్. అయితే, తన పర్ఫార్మెన్స్ తో క్రిటిక్స్ చేత శభాష్ అనిపించుకున్నాడు కూడా . ఆ తరువాత తన సుదీర్ఘ కెరీర్ లో ‘సుందరకాండ’, ‘చినరాయుడు’, ‘పవిత్ర బంధం’, ‘రాజా’, ‘సంక్రాంతి’ ఇలా ఎన్నెన్నో సినిమాలతో ఫ్యామిలీ హీరోగా తిరుగులేని పేరుతెచ్చుకున్నాడు. అదే సమయంలో, ’గణేష్’, ‘తులసి’,'ఘర్షణ',‘లక్ష్మి’ లాంటి  సినిమాలతో మాస్ ప్రేక్షకులను కూడా తనదైన స్టైల్లో అలరించాడు. ఇక ‘ప్రేమ’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘ప్రేమించుకుందాం..రా’, 'క‌లిసుందాం రా', 'జ‌యం మ‌న‌దేరా..' , 'మ‌ల్లీశ్వరి',  'నువ్వు నాకు న‌చ్చావ్'.. ఇవి వెంకీ తప్ప మరెవరూ చేయలేని క్లీన్ ఎంటర్టైనర్స్!


కొత్త నటులు, టెక్నీషియన్స్ కి ఛాన్స్ ఇవ్వడంలోనూ వెంకీ ఎప్పుడూ ముందుంటాడు. ఇక ఏఎన్నార్, ఎన్టీఆర్, శోభన్ బాబు తర్వాత కనుమరుగైపోయిన మల్టీస్టారర్ సినిమాలకు తొలిసారి పచ్చజెండా ఊపింది కూడా వెంకీనే. ప్రిన్స్ మహేష్ బాబుతో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు', యువ హీరో రామ్‌తో 'మసాలా', పవన్ కళ్యాణ్‌తో 'గోపాల గోపాల', వరుణ్ తేజ్ తో 'ఎఫ్‌ 2', నాగచైతన్యతో ' వెంకీ మామ' వంటి చిత్రాల్లో నటించి భారీ విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో 'అసురన్‌' ని రీమేక్ చేస్తున్న వెంకటేష్ 2021 ఫస్ట్ హాఫ్ లో  'నారప్ప'గా రాబోతున్నాడు.


వెంకటేష్ పర్సనల్  లైఫ్ విషయానికి వస్తే, ఆయన ఫ్యామిలీ బర్డ్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన డి. రామానాయుడు గారంటే అమితమైన గౌరవం. అన్న సురేష్ బాబుతో సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోడని వెంకటేష్‌కి పేరు. వరుసగా సినిమాలు చేస్తునే ఫ్యామిలీ మెంబర్స్ తో ఎక్కువ టైమ్ గడుపుతాడు. ఎంత స్టార్ డమ్ వచ్చినా.. దానిని తలకు ఎక్కించుకోకుండా హీరోలందరి అభిమానులతో అభిమానించబడే హీరోగా పేరు పొందారు. అలాగే ఎటువంటి వివాదాలను కొని తెచ్చుకోలేదు. ఒక క్రమశిక్షణ, అంకిత భావం, కమిట్మెంట్‌కి కట్టు బడి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడూ నవ్వుతూ.. నలుగురిని నవ్విస్తూ ఉండే వెంకీ.. మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలి.. ఇలా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుందాం.



Updated Date - 2020-12-13T02:08:58+05:30 IST